Wednesday, 15 February 2017

బి) దుఃఖ దేవ రహస్యములు



బి) దుఃఖ దేవ రహస్యములు
 (మంగళ, శుక్రవారములందును ద్యానింప దగినవి )


1.     యేసు గేత్సమనే తోటలో రక్తపు చెమట చెమర్చు టను గురించి ధ్యానించుదుము. (మత్తయి 26:36-4 4 )

2.     యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదుము. (మత్తయి 27:20-26)

3.     యేసు శిరస్సుపై ముండ్ల కిరీటము పెట్టి కొట్టుట ను గురించి ధ్యానించుదుము. (మత్తయి 27:27-31)

4.     యేసు స్లీవను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుము. (లూకా 23:26-28)

5.     యేసు స్లీవమీద కొట్టబడి మరణించుటను గురించి ధ్యానించుదుము.( యోహాను 19:23-30)

ఎ) సంతోష దేవ రహస్యములు


ఎ) సంతోష దేవ రహస్యములు

(సోమ, శనివారములయందు ధ్యానింపదగినవి)

1.     గాబ్రియేలు దూత మరియమ్మకు  మంగళ వార్త చెప్పుటను గురించి ధ్యానించుదుము.(లూకా 1:26-38)

2.     మరియమాత ఎలేజేబెతమ్మను సందర్శించుట ను గురించి ధ్యానించుదుము. ( లూకా 1: 39-45)

3.     యేసు పుట్టుకను గురించి ధ్యానించుదుము. (లూకా 2:1-14)

4.     బాలయేసును దేవాలయములో కానుకగా అప్పగించుటను గురించి ధ్యానించుదుము.(లూకా 2:21-35)

5.     మరియమ్మ కానకపోయిన బాలయేసును దేవాలయములో కనుగొను టను గురించి ధ్యానించుదుము.(లూకా 2:41-52 )

19.జపమాల ప్రార్థన



19.జపమాల ప్రార్థన



             ప్రారంభ ప్రార్థన : మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఓ సర్వేశ్వరా? మీ సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను గాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని, మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ జపమాలను పరాకులేక భక్తితో చేసుకొనుటకు మీ  సహాయము దయచేయ నవధరించండి. సమాల పుణ్యములకు మూలమై యుండుటవలన ముదుగా విశ్వాస సంగ్రహము వేడుకోనుదముగాక.



విశ్వాస సంగ్రహము: పర లోకమును, భూలోకమును సృష్టించిన సర్వశక్తికగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏక పుత్రుడును, మన యొక్క నాథుడైన ఏసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోoత్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి, స్లీవ మీద కొట్టబడి మరణము పొంది  సమాధిలో వుంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారాలలో నుండి లేచెను. పర లోకమునకు ఎక్కి  సర్వశక్తికగల  పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి యున్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును, చనిపోయిన వారలకును తీర్పు చేయుటకును వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ద కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.





పరలోకజపము: పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. (మత్తయి  6:9-13, లూకా 11:2-4)



త్రిత్వ స్తోత్రము: పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదా కాలము మహిమ కలుగు గాక. ఆమెన్.



            ఫాతిమా ప్రార్థన: ఓ! నా జేసువా! నా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృపా రసము అత్యవసరమూ వారందరినీ మీ మోక్ష దరి చేర్చండి.

18.అష్ట భాగ్యములు


18.అష్ట భాగ్యములు



1.     దీనాత్ములు ధన్యులు- దైవ రాజ్యము వారిది.

2.     శోకార్తులు ధన్యులు- వారు ఓదార్పబడుదురు.

3.     వినమ్రులు ధన్యులు- వారు భూమికి వారసులగుదురు.

4.     నీతి నిమిత్తము ఆకలి దుప్పులు గలవారు ధన్యులు- వారు సంతృప్తి పరుపబడుతురు.

5.     దయామయులు ధన్యులు – వారు దయను పొందుదుర

6.     నిర్మల హృదయులు ధన్యులు -వారు దయను పొందుదురు.

7.     శాంతి స్థాపకులు ధన్యులు- వారు దేవుని కుమారులనబడుదురు.

8.     ధర్మార్థము హింసితులు ధన్యులు- దైవ రాజ్యము వారిది. మత్తయి 5:౩-10.

7)   జ్ఞాన వివాహము


7)   జ్ఞాన వివాహము


ప్ర: జ్ఞాన వివాహము అనగా నేమి?

జ: దంపతులు సన్మార్గమునా నడచుటకు, తమ బిడ్డలను విశ్వాసములో పుణ్య మార్గములో నడిపించుటకు ను, దేవ వరప్రసాదములను ఇచ్చెడు దేవ వరప్రసాదములను ఇచ్చెడు దేవ ద్రవ్య అనుమానము.

6)   గురు పట్టము


6)   గురు పట్టము


ప్ర: గురు పట్టము అనగా నేమి?

జ: దివ్య బలి పూజ చేయుటకు గురు సంబంధమైన, ఇతర కార్యములను నెరవేర్చుటకు అధికారమును, దేవ వరప్రసాదములను ఇచ్చెడు దేవ ద్రవ్య అనుమానము.

5)  వ్యాధిగ్రస్తుల అభ్యంగము,


5)   వ్యాధిగ్రస్తుల అభ్యంగము,


ప్ర: వ్యాధిగ్రస్తుల అభ్యంగము అనగా నేమి?
జ: వ్యాధిగ్రస్తుల ఆత్మ శరీరములకు ఆదరణ ఇచ్చెడు దేవ ద్రవ్య అనుమానము.
ప్ర: వ్యాధిగ్రస్తుల అభ్యంగము పొందుటకు వ్యాధిగ్రస్తులు ఏమి ఆయత్తము చేయవలయును?

జ: సర్వేశ్వరుని చిత్తమునకు నిండు మనసుతో లోబడి, సర్వేశ్వరుని మీద నమ్మక ముంచి, చావైన పాపము లేక ఉండవలయును.