పునీత 1 వ అర్బన్ మే 25
(17 వ పోపు, వేద సాక్షి,
క్రీ||శ||230)
పునీత 1 వ కల్లిస్తాస్
పోపుగారి వేదం సాక్షి మరణాంతరం శ్రీసభకు 17 వ పోపుగా పునీత 1 వ అర్బన్ గారు
ఎన్నికయ్యారు. వీరి పాలన క్రీ||శ||222 లో ఆరంభమైనది. కాని పాలన గురించి ఎక్కువ
వివరాలు తెలియకపోయినా రోమను రాజ్యానికి పాలకుడైన అలెగ్జాండర్ సవేరాస్ యొక్క కాలంలోనే
వారు జగద్గురువుగా సేవలందించినట్లు తెలుస్తుంది. చక్రవర్తి ఈ పోపుగారి పట్ల
సానుకూలంగా వుండటం వల్ల క్రైస్తవులు ప్రశాంత జీవితాన్ని కొనసాగించారు.
వీరికి ముందు పనిచేసిన కల్లిస్తాస్ పోపుగారి కాలంలో ప్రబలిన మత
వ్యతిరేకుల ఉద్యమాలు చాలామట్టుకు వీరికాలంలో తగ్గుముఖం పట్టాయి. పోపుగార్ల
గ్రంథరాజం ప్రకారం వీరు రోమీయుడని పొంత్సియాను కుమారుడని తెలుస్తుంది. డయోక్లేషియన్
చక్రవర్తి పాలనలో వీరు రోము నగరంలో క్రీ||శ|| 230 మే 23 న వేదసాక్షి మృత్యువును
కౌగలించుకొన్నట్లు ఈ గ్రంథం స్ప్రష్టం చేసింది.
పునీత జేరోముగారి నివేదికల చొప్పున వీరిని పునీత కల్లిస్తాస్
సమాధుల వాటికలో మే నెల 25 న ఖననం చేసినట్లు వివరింప బడింది. అర్బన్ అంటే మర్యాద,
మంచితనం అని అర్థం.
ధ్యానంశం:
“నేను మీ క్షేమము కొరకు
ఉద్దేశించిన పతకములు నాకు మాత్రమే తెలియును. నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును
కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని” అని దేవుడు నుడువుచున్నాడు.
(యిర్మియా 29:11)
No comments:
Post a Comment