Tuesday 14 February 2017

1.వ ప్రకరణము- ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు

1.వ ప్రకరణము-
ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు

1.పరలోకమునకు, భూలోకమునకు కర్త ఎవరు? 
సర్వేశ్వరుడు.
2.ఎందరు సర్వేశ్వరులు ?
 ఒకే సర్వేశ్వరుడు గాని, త్రిత్వవంతుడై యున్నాడు.
3.సర్వేశ్వరుడు త్రిత్వవంతుడై వున్నడనుటకుఅర్థము ఏమి? 
పిత పుత్రుడు, పవిత్రాత్మ అను ముగ్గురు వేరు వేరు వ్యక్తులు వున్నరనియు, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావము ఒకటేననియు అర్థము.
4.ఆ ముగ్గురు వ్యక్తుల పెరులేమి?
 పిత, పుత్రుడు, పవిత్రాత్మ.
5.పిత సర్వేశ్వరుడా? 
సర్వేశ్వరుడు.
6.పుత్రుడు సర్వేశ్వరుడా?
 సర్వేశ్వరుడు.
7.పవిత్రాత్మ సర్వేశ్వరుడా?
 సర్వేశ్వరుడు.
8.ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరులా, లేక ఒకే సర్వేశ్వరుడా?
 ఒకే సర్వేశ్వరుడు.
9.ఈ ముగ్గురు వ్యక్తులు ఎందు వలన ఒకే సర్వేశ్వరుడై యున్నారు?
 ఈ ముగ్గురికిని ఒకే జ్ఞానము, ఒకే చితము, ఒకే శక్తి, ఒకే దేవా స్వభావమును ఉండుట వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై యున్నారు.
10.వీరలయందు శక్తి, మహిమ మొదలైన లక్షనములలో బేదము కలదా? 
బేదములేదు, ఈ ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సరిసమానులు.
11.వీరిలో మొదటి వ్యక్తియు, వెనుకటి వ్యక్తియు గలరా?
 లేరు
12.ఎందువలన లేరు? 
పిత, పుత్రుడు, పవిత్రాత్మ ఆరంభములేని వారలై యుండుట వలన వీరలలో ముందటి వ్యక్తి లేడు, వెనుకటి వ్యక్తి లేడు.
13.సర్వేశ్వరుని ముఖ్య లక్షణములు ఎన్ని?
ఆరు.
1.     సర్వేశ్వరుడు తనంతట తానై యున్నాడు.
2.     ఆరంభములేక యున్నాడు.
3.     శరీరములేక యున్నాడు.
4.     మితిలేని సకలమేలుల స్వభావము కలిగి యున్నాడు.
5.     అంతట వున్నాడు.
6.     పరలోకమునకు, భూలోకమునకు మూలకారణమై యున్నాడు.

No comments:

Post a Comment