Tuesday 14 February 2017

2.వ ప్రకరణము- లోక సృష్టి- ఆది తల్లి దండ్రుల పాపము


2.వ ప్రకరణము-
లోక సృష్టి- ఆది తల్లి దండ్రుల పాపము

1.   సార్వేశ్వరుడు పరలోకనునకు, భూలోకమునకు ఎటుల మూల కారణమై యున్నాడు?  సర్వేశ్వరుడు పరలోకమును, భూలోకమును, వానిలోనుండు సకల వస్తువులను సృష్టించి కాపాడుటవలన, సర్వమునకు మూలకారణమై యున్నాడు.
2.   సర్వేశ్వరుడు సృష్టించిన వస్తువులలో శ్రేష్టమైనవి ఏమి?
శరీరములేని సంమస్కులు, ఆత్మ శరీరము గల మనుష్యులు.
3.   సర్వేశ్వరుడు సన్మనస్కులను ఎటువంటి స్థితిలో సృష్టించెను?
పరిశుద్దమును, సుఖమునైన స్థితిలో సృష్టించెను.
4.సన్మనస్కులందరు తమ శ్రేష్టమైన స్థితిలో స్థిరముగా నుండిరా?
లేరు. కొందరు గర్వముచేత సర్వేశ్వరుని ఆజ్ఞ మీరినందున నరకములో త్రోయబడిరి.
5.  ఇట్లు చెడిపోయిన సన్మనస్కులు పేరేమి?
పిశాచులు.
6.సర్వేశ్వరుడు మనుష్యులను ఎందుకు సృష్టించెను? 
ఈ లోకములో తనను తెలుసుకొని,ప్రేమించి,సేవించి అటువెనుక మోక్షము పొందుటకును మనుష్యులను సృష్టించెను .
7.   సర్వేశ్వరుడు ఆది తల్లితండ్రులను ఎటువంటి స్థితిలో సృష్టించెను?
పరిశుద్ధమును, భాగ్యమునైన స్థితిలో సృష్టించెను.
8.   ఆది తల్లితండ్రులు ఆ పరిశుద్ధమును, భాగ్యమునైన స్థితిని ఎటుల పోగొట్టుకొనిరి? సర్వేశ్వరుడు తినవద్ధనిన పండును వారాలు తిని పాపము కట్టుకొనిరి.
9.   ఆది తండ్రి ఆ పాపముచేత తాను మాత్రమె ఆ పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిని పోగోట్టుకొనెనా? 
లేదు. తన సంతతివారాలకు దానిని పోగొట్టెను.
10.ఆ పరిశుద్ధమును,భాగ్యమునైన స్థితి ఆది తండ్రి యొక్క సంతతివారాలకు ఎందువలన పోయెను? 
ఆది తండ్రి మనుష్యులకందరికి తండ్రియై ఉన్నందు వలన, అందరు పుట్టుకతోనే ఆ పాప కళంకము పొందుచున్నారు.
11.ఆ పాప కళంకము పేరేమి? 
జన్మపాపము
12.జన్మ పాపముచేత మనుష్యులు ఏ శిక్షకు పాత్రులైరి? 
మోక్షమును పోగొట్టుకొని, పిశాకికి దాసులై మరణమునకును, ఇతర బాధలకును పాత్రులైరి.
13.జన్మపాపము యేతుల పరిహారమై పోవును? 
జ్ఞాన స్నానము చేత  మాత్రమే పరిహారమై పోవును.


No comments:

Post a Comment