౩. వ ప్రకరణము-
మనుష్యుల రక్షణము
1.మనుష్యులను
రక్షించుటకై మనుష్యుడై పుట్టిన వారెవరు?
మహా పరిశుద్ధ ఏకత్రిత్వము యొక్క రెండవ
వ్యక్తియగు పుత్రుడైన సర్వేశ్వరుడు.
2.పుత్రుడైన
సర్వేశ్వరుడు ఎలాగు మనుష్యుడై పుట్టెను?
పవిత్రాత్మ వలన గర్భమై ఎన్నటికి కన్య మహిమ
చెడని కన్య మరియమ్మ నుండి పుట్టెను.
3.పుట్టిన
ఎనిమిదవ దినమున లోక రక్షకునకు ఏమి పేరు పెట్టిరి?
యేసు అని పేరు పెట్టిరి.
4.యేసు
అను పేరునకు అర్థమేమి?
మనుష్యుల రక్షుడు.
5.యేసునాధుడు
ఈ లోకములో ఎన్ని సంవత్సరములోండెను?
ముప్పది మూడు సంవత్సరములుండెను.
6.యేసునాధుడు
ఈ లోకములో ఏమి చేసెను?
సకల పున్యక్రియలను, అనేక అద్భుతములను చేసి, సత్య వేదమును
బోధించి అపోస్తలులను నియమించెను.
7.యేసునాధునికి
ఎన్ని స్వభావములు గలవు?
దేవ స్వాభావము, మనుష్య స్వభావము అను రెండు స్వభావములు
గలవు.
8.యేసునాధుడు
ఏ స్వభావమున పాటుపడెను?
మనుష్య స్వభావమున పాటుపడెను.
9.యేసునాధుడు
ఎవరి కొరకు పాటుపడెను?
మానవులందరి కొరకు పాటుపడెను.
10.యేసునాధుడు ఏలాగున పాటుపడెను?
పొంత్సు పిలాతుని
అధికారమునకు లోనై పాటుపడి,స్లీవమీద కొట్టబడి, మరణము పొంది సమాధిలో వుంచబడెను.
11.అప్పుడు యేసునాధుని దివ్య ఆత్మ ఎక్కడికి పోయెను?
పాతాళము అను పితా పితరుల స్థలనునకు దిగెను.
12.యేసునాధుని దివ్య ఆత్మ అచ్చటికి ఎందుకు దిగెను ?
పుణ్యాత్ములు త్వరలోని మోక్షము పొందుదరని తెలియజేయుటకు పాతాళమునకు దిగెను.
13.యేసునాధుడు
సమాధి నుండి లేచెనా?
ముడవనాడు జీవముతో లేచెను.
14.యేసునాధుడు
సమాదినుండి లేచిన వెనుక భూలోకములో ఎన్ని దినములు ఉండెను?
నలువది దినములు ఉండెను.
15.యేసునాధుడు
నలుబది దినములు ఏమి చేసెను?
పలుమార్లు అపోస్తులులకు అగుపడి, వారల విశ్వాసమును దృఢ
పరచి, వారాలకు తిరుసభ మీద అధికారమిచ్చెను.
16.యేసునాధుడు
నలుబదియవ దినమున ఎక్కడికి పోయెను?
పరలోకనునకు ఎక్కి సర్వసక్తిగల పితయైన
సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చిండి యున్నాడు.
17.యేసునాధుడు
ఇప్పుడు ఎక్కడ వున్నాడు?
దేవ స్వభావమున అంతట యున్నాడు. మనుష్య స్వభావమున
పరలోకమందును, దివ్య సత్ప్ర సాద మందును వున్నాడు.
No comments:
Post a Comment