Tuesday 14 February 2017

4.వ ప్రకరణము- పవిత్రాత్మ రాకడ – తిరుసభ యొక్క ఏర్పాటు

4.వ ప్రకరణము-
పవిత్రాత్మ రాకడ – తిరుసభ యొక్క ఏర్పాటు

1.     యేసు నాధుడు పరలోకమునకు ఎక్కిన పదియవ దినమున ఎమిచేసేను? 
      తన అపోస్తులుకు పవిత్రాత్మయైన సర్వేశ్వరుని పంపెను.
2.     యేసు నాధుడు పవిత్రాత్మను ఎందుకు పంపెను?
      తిరుసభ వ్యపకను చేసి దానిని ఎర్పరచుటకు అపోస్తలులకు విశేషమైన జ్ఞానమును, దైవ సహాయమును ఇచుటకు పవిత్రాత్మను పంపెను.
3.     పవిహ్రాత్మను పొందిన వెనుక అపోస్తులులు ఏమి చేసిరి?
      నానా దేశములలో బోధించి, తిరుసభను యేర్పరచిరి,
4.     తిరుసభ యొక్క అధిపతి ఎవరు?
      యేసు నాధుడు
5.     యేసు నాధుడు తనకు బదులుగా తిరుసభకు అధిపతియై ఉండుటకు ఎవరిని నియమించెను? 
     పునీత రాయప్ప (పేతురు) ను నియమించెను.
6.     పునీత రాయప్పకు బదులుగా తిరుసభకు అధిపతి ఎవరు? 
      పరిశుద్ధ పాపుగారు.
7.     ఇతర అపోస్తులులకు బదులుగా నుండు వారెవరు? 
      మెత్రాణులు

8.     యేసు నాధుడు ఎన్ని సభలను స్థాపించెను? 
      యేసు నాధుడు ఒకే కతోలిక సభను స్థాపించెను.దానిని మాత్రమే అపోస్తులులు యేర్పరచిరి.

No comments:

Post a Comment