Tuesday 14 February 2017

5.వ ప్రకరణము- మనుష్యుని కడగతులు

5.వ ప్రకరణము-
                                                  మనుష్యుని కడగతులు

1.పాపము  నిమిత్తము సకల మనుష్యులకు వచ్చిన శిక్ష ఏమి? 
మరణము.
2.మరణము తరువాత ఏమి జరుగును?
 ప్రత్యేక తీర్పు.
3.ప్రత్యేక తీర్పు తరువాత చావైన పాపముగల ఆత్మలు ఎక్కడికి పోవును? 
నరకమునకు పోవును.
4.పరిశుద్దాత్మలు ఎక్కడికి పోవును? 
మోక్షమునకు పోవును.
5.తమ పాపముల కొరకు పూర్తిగా వుత్తరిoపని పుణ్యవంతుల ఆత్మలు ఎక్కడికి పోవును? ఉత్తరించు స్థలమునకు పోవును.
6.ఉత్తరించు స్థలములో అవి అనుభవించు బాధలు ఏవి? 
దేవుని చూచు భాగ్యము లేక తమ పాపములకు తగిన శిక్షను అనుభవిoచుచు ఉత్తరించును.పూర్తిగా ఉత్తరించిన వెనుక మోక్షము పొందును.
7.ప్రత్యేక తీర్పుగాక వేరొక తీర్పు గలదా?
 సాధారణ గలదు.
8.అది ఎప్పుడు జరుగును? 
లోకంత్యమున జరుగును.
9.లోకము ఎటుల ముగియును? 
లోకమంతయు అగ్నిచేత నాశనమగును. మనుష్యులందరు చనిపోవుదురు.
10.అప్పుడు ఏమి సంభవించును? 
యేసు నాధుడు మనుష్యులందరిని ఆత్మ శారీరములతో లేపి, మహా ప్రతాపముతో తీర్పు చేయుటకు వచ్చును.
11.యేసు నాధుడు న్యాయ తీర్పు ఎటుల చేయును?
 ఒక్కక్కని పాపపుణ్యములను అందరి ఎదుట తెలియపరచి, పాపాత్ములను శపించి నరకమున త్రోసి, పున్యాత్ములను ఆశీర్వదించి తనతో మోక్షమునకు తోడుకొని పోవును.
12.పాపాత్ములు నరకమందు అనుభవించు బాధలు ఏవి? 
సర్వేశ్వరుని యెన్నటికిని చూడక, కాలంత కాలము పిశాచులతో అగ్నియందే కాలి సర్వ బాధలను అనుభవించెదరు.

13.పుణ్యాత్ములు మోక్షములో అనుభవించు భాగ్యమేమి?
సర్వేశ్వరుని ముఖాముఖిగా దర్శించి కాలంత కాలము సకల భాగ్యములను అనుభవించెదరు.

No comments:

Post a Comment