Tuesday 14 February 2017

6.వ ప్రకరణము- పాపము- పుణ్యము


6.వ ప్రకరణము-
పాపము- పుణ్యము

1.మోక్షము పొందుటకు వేద సత్యములను విశ్వసించుట మాత్రము చాలునా?
 చాలదు. పాపము కట్టుకొనక, పుణ్య క్రియలను చేయవలయును.
2.పాపము అనగానేమి? 
సర్వేశ్వరుడు ఆజ్ఞాపించిన దానిని బుద్ధి వివరము తెలిసిన వెనుక మనసొప్పి మీరుటయే పాపము.
3.సర్వేశ్వరుడు ఏమి ఆజ్ఞాపించుసున్నాడు? 
పది ఆజ్ఞలను, తిరుసభ యొక్కయు, అధికారము గల యితరుల కట్టడలను,
4.పాపము ఎన్ని విధములుగానున్నది? 
చావైన పాపము, స్వల్ప పాపము అను రెండు విధములుగా నున్నది.
5.చావైన పాపము అనగా నేమి?
 దేవ ఇష్ట ప్రసాదమును పోగొట్టి  మనలను నరకమునకు  పాత్రులను చేయు పాపము.
6.స్వల్ప పాపము అనగా నేమి? 
దేవ యిష్ట ప్రసాదమును పోగొట్టక మనలను ఉత్తరించు స్థలమునకు పాత్రులను చేయు పాపము.
7.పుణ్యములలో ప్రధానమైనవి ఎన్ని?
 మూడు. విశ్వాసము, నమ్మిక, దైవప్రేమ.
8.ఈ మూడు పుణ్యములు ఎందుకు ప్రధానమైనవి? 
మనుష్యులజు ఈ మూడు పుణ్యములలో యేదొకటి లేనియెడల మోక్షము లేదు.

No comments:

Post a Comment