Tuesday 14 February 2017

7.వ ప్రకరణము- దేవ వర ప్రసాదము, జపము, దేవ ద్రవ్య అనుమానములు.


7.వ ప్రకరణము-
                దేవ వర ప్రసాదము, జపము, దేవ ద్రవ్య అనుమానములు.

1.     పాపము కట్టుకొనక మోక్షము పొందుటకు అణా స్వంతబలము చాలునా? 
     చాలదు. దేవ వరప్రసాదము అవసరమై యున్నది.
2.     దేవవరప్రసాదము అనగానేమి? 
      మోక్షము పొందుటకు సర్వేశ్వరుడు మనకు వుచితముగా దయచేయు దైవ వరమే దేవవరప్రసాదము.
3.     దేవ వరప్రసాదము ఎటుల పొందగలము?
      జపము వలనను, దేవద్రవ్య అనుమానముల వలనను పొందగలము.
4.     జపము అనగా నేమి? 
      భక్తి కలిగి దేవునితో సంభాషించుటయే జపము.
5.     సర్వేస్వరునిగాక, లోక విషయములను గూర్చి మనసొప్పి చేసిన జపము మంచి అగునా? 
      కాదు, సర్వేశ్వరుడు ఇట్టి జపమును ఆలకించడు.
6.     దేవద్రవ్య అనుమానము అనగానేమి? 
      దేవ వర ప్రసాదములను ఇచ్చుటకు యేసు నాథుడు స్థాపించిన సాధనము.
7.     దేవద్రవ్య అనుమానములు ఎన్ని? అవి ఏవి?
    ఏడు
1.     జ్ఞానస్నానము
2.     భద్రమైన అభ్యంగము,
3.     దివ్య ప్రసాదము
4.     పాప సంకీర్తనము
5.     వ్యాధిగ్రస్తుల అభ్యంగము,
6.     గురుపట్టము
7.     జ్ఞాన వివాహము
8.     ఏ దేవ ద్రవ్య అనుమానములను ఒకసారి మాత్రమే పొందవచ్చును?
1. జ్ఞాన స్నానము,
2.భద్రమైన అభ్యంగము

౩.గురుపట్టము

No comments:

Post a Comment