19.జపమాల ప్రార్థన
ప్రారంభ
ప్రార్థన : మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఓ సర్వేశ్వరా? మీ సన్నిధిలో జపము
చేయుటకు నేను పాత్రుడను గాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని, మీకు మహిమగాను
దేవమాతకు స్తోత్రముగాను ఈ జపమాలను పరాకులేక భక్తితో చేసుకొనుటకు మీ సహాయము దయచేయ నవధరించండి. సమాల పుణ్యములకు
మూలమై యుండుటవలన ముదుగా విశ్వాస సంగ్రహము వేడుకోనుదముగాక.
విశ్వాస
సంగ్రహము: పర లోకమును, భూలోకమును సృష్టించిన సర్వశక్తికగల పితయైన
సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏక పుత్రుడును, మన యొక్క నాథుడైన
ఏసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి
పుట్టెను. పోoత్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి, స్లీవ మీద కొట్టబడి మరణము
పొంది సమాధిలో వుంచబడెను. పాతాళమునకు దిగి
మూడవ నాడు చనిపోయిన వారాలలో నుండి లేచెను. పర లోకమునకు ఎక్కి సర్వశక్తికగల
పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి యున్నాడు. అక్కడ నుండి జీవించు
వారలకును, చనిపోయిన వారలకును తీర్పు చేయుటకును వచ్చును. పవిత్రాత్మను
విశ్వసించుచున్నాను. పరిశుద్ద కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును
విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క
ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్.
పరలోకజపము: పరలోకమందుండెడు మా యొక్క తండ్రి
మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలకమందు
నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు
నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు
మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.
(మత్తయి 6:9-13, లూకా 11:2-4)
త్రిత్వ స్తోత్రము: పిత, పుత్ర,
పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదా కాలము మహిమ
కలుగు గాక. ఆమెన్.
ఫాతిమా
ప్రార్థన: ఓ! నా జేసువా! నా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి
నన్ను కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృపా రసము అత్యవసరమూ వారందరినీ
మీ మోక్ష దరి చేర్చండి.
No comments:
Post a Comment