1)
జ్ఞాన స్నానము.
ప్ర: జ్ఞాన స్నానము అనగా నేమి?
జ:
జన్మ పాపమును ఇతర పాపములు పోగొట్టి మనలను సర్వేశ్వరునికి, తిరు సభకు బిడ్డలుగా
చేయు దేవ ద్రవ్య అనుమానము.
ప్ర: జ్ఞాన స్నానము
సాధారణముగా ఇచ్చు వారెవరు?
జ:
గురువులు
ప్ర:
మరణ అవస్థలో ఎవరైనా జ్ఞాన స్నానము ఇవ్వవచునా?
జ:
అట్టి సమయములో ఎవరైనా జ్ఞాస్నానము ఇవ్వవచును.
ప్ర:
తిరుసభ యొక్క తలంపు ప్రకారము జ్ఞాన స్నానము ఇచ్చుట ఎటుల?
జ: జ్ఞాన
స్నానము ఇచ్చువారు దానిని పొందువాని తలమీద నీల్లుపోయుచు, (పేరు చెప్పి) “పిత,
పుత్ర, పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞాన స్నానము ఇచ్చుచున్నాను” అని చెప్పవలెను.
ప్ర:
పసిబిడ్డలకు మాత్రమే గాక బుద్ధి వివరములు తెలిసిన వారాలకు, మరనావస్థలో జ్ఞాన
స్నానము ఇవ్వవచునా?
జ:
మరనావస్థలో జ్ఞాన స్నానము కోరిన వారికి ప్రధాన సత్యములు తెలియపరచి, పాపముల కొరకు
దుఃఖము పుట్టించి, జ్ఞాన స్నానము ఇవ్వవలయును.
ప్ర: ఆ
ప్రధాన సత్యములెన్ని?
జ:
నాలుగు.
1.
ఒకే సర్వేశ్వరుడు వున్నాడు.
2.
ఒకే సర్వేశ్వరుని యందు పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు
వ్యక్తులున్నారు.
3.
పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారమెత్తి మనుష్యులను
రక్షించెను.
4.
సర్వేశ్వరుడు పుణ్యాత్ములకు మోక్షము దయచేసి, పాపాత్ములకు
నరక బాధలను విధించును.
ప్ర: ఈ నాలుగు సత్యములు తెలియని వానికి జ్ఞాన స్నానము ఇచ్చిన యెడల చెల్లునా?
జ: చెల్లదు.
No comments:
Post a Comment