Wednesday 15 February 2017

పరిశుద్ధ  సిలువ మార్గము




పరిశుద్ధ  సిలువ మార్గము


పీఠమునకు  ముందు జపము

నా రక్షకుడా! యూదులు మిమ్ము హత్య జేయుటకు తీసుకు పోయిన ఈ  కఠిన మార్గమందు, నా మీద గల దయ వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్నియో మారులు మిమ్ము ఎడబాసి పోతిని! ఐనను యిప్పుడు పుర్ణాత్మతో మిమ్మును ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందున నిండు మనస్తాపముగా నున్నాను. నా తప్పులను మన్నించండి.ఈ దుఃఖకర మార్గమందు మిమ్మును వెంబడించి వచ్చుటకు, నాకు అనుగ్రహము దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావవలెనని కోరుచున్నాను మీ ప్రేమలో జీవిమ్పను మీ ప్రేమలో మరణము పొందను ఆశించుచున్నాను. ఆమెన్.

పాట: యేసునాధు డుర్విలోను
గాసి జెంది ప్రేమ మీర
దాసులన్ రక్షించెను
 
1 వ స్థలము

జేసు నాధుడు మరణ తీర్పు పొందుట
ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.

  యేసు ప్రభువు రాతి  స్తంభమున దెబ్బలు  పడి ముండ్ల కిరీటము ధరిoపబడిన వెనుక పిలాతునిచే అన్యాయముగా స్లీవలో మరణము తీర్పు విదిమ్పవడుతను ధ్యానించుడుము గాక. ( కొంతసేపు ధ్యానము )

  నా రక్షుకుడైన జేసువా! మీకు మరణదండన విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాములే మిమ్ము అట్టి తీర్పునకు లోజేసెను. ఈ దుఃఖ కరమైన స్లీవ మార్గము యొక్క ఫలము జూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువులకంటే మిమ్ము నదికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందువలన నిండు మనస్సుతో దుఃఖించుచున్నాను. ఆమెన్.
(1 పర. 1 మంగళ. 1త్రిత్వ)


 ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ!
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ!


  పాట: భారమైన స్లీవ మ్రాను
    క్రూరులైన యూదజాతి                                
    వారు యేసు కేత్తిరి.

2వ స్థలము
జేసు ప్రభువు స్లీవను మోయుట

ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
యేసు ప్రభువు తన భుజము మీద స్లీవను మోసికోనుపోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాతులను, మరణమును, మన కొరకు తన పితకు సమర్పించుతాను ధ్యానించుదము గాక. (కొంతసేపు ధ్యానము)
   నా రక్షుకుడైన యేసువా! మరణ కాలము వరకు మీరు నాకు విధించియుండెడు దురితములను చేకొని నా పాపములకొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవను మోసికోనిపోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును జూచి నేను నిండు ఓర్పుతోను, పూర్ణ పరిత్యాగముతోను నా స్లీవను మోసుకొనటకు నాకు కావలసిన సహాయము దయచేయ వలయునని మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమెన్.
(1 పర. 1 మంగళ .1 త్రిత్వ)

ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ!
ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ!

పాట: మమ్ము  బ్రోవ ప్రేమనంత
  క్రుమ్మరించ వేడినాము
   మిమ్ము నేక దీక్షతో

౩ వ స్థలము
యేసు ప్రభువు మొదటిసారి స్లీవ క్రింద బోర్ల పడుట

ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
    నా రక్షకుడైన యేసువా! మీరు రాతి స్థంభమున పొందిన దెబ్బలవలన మీ దేహములో నుండి రక్తము దారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత యేర్పడెను ఐనను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప స్లీవ మ్రానును మ్యవలసి యున్తిరి. రానువులు వారిని కొట్టినందున ఇట్లు పలుమారు నేలపడిరని ధ్యానించుదుముగాక!
(కొంతసేపు ధ్యానించుదము)
     
నా రక్షకుడైన జేసువా! మీ కింత బాధ పెట్టినది స్లీవ భారము కాదు. నా పాపముల భారమే. ఈ మొదటిసారి క్రింద పడుట యొక్క ఫలమును జూచి పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడు మిమ్మును ప్రేమించ అనుగ్రహము పాలించండి. ఆమెన్.
(1 పర. 1 మంగళ. 1 త్రిత్వ)

ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ.
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ.
పాట: దేవ మాతా దీనురాలై
దైవ పుత్రున్ వెంబండించె
స్లీవ మోయుచుండగా,

4 వ స్థలము
యేసు ప్రభువు తమ దివ్య మాతకు ఎదురుపడుట

ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.

ఈ ప్రయాణము నందు కుమారుడును, తల్లియై అనుభవించిన దుఃఖమును ధ్యానించుదముగాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన తిరు హృదయములను పొడిచి తెరచిన అంబుల పోలియుండెను. (కొంత సేపు ధ్యానించుదము )
      నా రక్షకుడైన యేసువా! ఈ దర్శనము నందు మీరునూ. మీ తల్లియును అనుభవించిన వ్యాకులమును జూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరునించండి. వ్యాకుల సముత్రములో మునిగియుండు నా రాజ్ఞీ! మీ దివ్యకుమారుని పాతులను నేను నిరంతరము భక్తితో స్మరించునట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచి పెట్టుటకు ఈ పాటుల ధ్యానముచేత నాకు జ్ఞానబలము కలుగునట్లును నేను మీతో కలంత కాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొండునట్లును ప్రార్థించండి. ఆమెన్.             (1 పర. 1 మంగళ. 1 త్రిత్వ)

ఒకరు: యేసు క్రీస్తువా!మిమ్మునారాధించి
 మీకు స్తోత్రము   చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ
పాట: తల్లి యేసునాధున్ గాంచి
  తల్లడిల్లి సోమ్మసిల్లె
నుల్ల మెల్ల నీరయ్యెన్.
5.వ స్థలము
స్లీవను మోయుటకు సిరేనియా సేమోనుడు తోడ్పుడుట
ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
 ఇచ్చట యూదుల కఠోర చిత్తమును ధ్యానించుదము. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విడిచేది వారివలె వుండు చూచి ఆయనను అవమానముగా చంపవలెనని తలంచుచుండగా, త్రోవలోనే మృతినొందుదురేమోనని చింతించి వారి వెనుక స్లీవను మోసికొని వచుటకు సిరేనియా సీమోనుని బలవంతము చేసిరి.( కొంత సేపు ధ్యానించుదము )
నా రక్షడైన యేసువా! నీనును నా స్లీవను పోద్రోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును, మరణ సంఘటనమును చేకొని మా నిమిత్త ము మీరు మృతి పొందితిరి. నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి. ఆమెన్. (1 పర. 1 మంగళ. 1 త్రిత్వ)
ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ!
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ!
పాట: గాసినోంది స్లీవ మోయు      
యేసుస్వామీ మోము తూడ్చే
వాసిగా వేరోనిక.

6.    వ స్థలము
వేరోనికమ్మ యేసు ప్రభుని మిఖమును తుడుచుట

 ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
 వేరోనికమ్మ భక్తి అతిశయము ధ్యానించుదము గాక! యేసు ప్రభువు పొందిన శ్రమల దెబ్బల చేత కాంతిహీనమైన వారి పరిశుద్ధ ముఖమును ఆయమ్మ జూచి ఒక వస్త్రము వారి చేతికియ్యగా ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రము మీద ముద్రింప బడెను.  ( కొంత సేపు ధ్యానించుదము)
    నా రక్షకుడైన యేసువా! ముందు మీ తిరు ముఖము మిక్కిలి అందముగా నుండెను. కాని యిప్పుడు గాయముల చేతను, రక్తము చేతను మారుపడి విరుపముగా నున్నది. జ్ఞానస్నానములో నేను మీ యిష్ట ప్రసాదమును పొందినపుడు నా ఆత్మయు అందముగా నుండెను. ఐనను పాపములచేత దానిని చెదగోట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరుగ సౌందర్యవంతముగా జేయు శక్తులయివున్నారు. మీ రారిశుద్ద  పాతులను జూచి దానిని చక్క పరచండి. ఆమెన్. (1 పర. 1 మంగళ 1. త్రిత్వ)
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ
ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ

పాట: క్రూర యూద గుంపు యేసున్
ఘోర రీతి పట్టి కొట్టి              
మేరలోక మోదిరి
7.వ స్థలము
యేసు ప్రభువు రెండవసారి స్లీవ క్రింద బోర్ల పడుట
ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
    యేసు ప్రభువు రెండవసారిరి స్లీవ క్రింద పడుటను గురించి ధ్యానించుదము గాక! ఈ పాటుల వలన వారి తిరు శిరస్సు నుందును అవయవములందును గల గాయములలో మరల నొప్పి సలిగెను. (కొంతసేపు ధ్యానించు దము)
   నా రక్షకుడైన యేసువా! మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి వున్నాను నేను లెక్కలేని మారులు మల్లి పాపములో పది మీకు ద్రోహము చేసితిని. హా! యేసువా! ఇక నయినా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమును ఈ రెండవ పాటును జూచి నాకు దయచేయండి. నాకు వచ్చెడి సమాల శోధనలయందు సదా నేను మీ శరణు జోచ్చుటకు అనుగ్రహము పాలించండి. ఆమెన్. (1 పర. 1 మంగళ. 1 త్రిత్వ)

ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ.
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ.

పాట: కోరి పాపపుంజమెల్ల
  పారద్రోల యేసు స్వామి
  క్రూర బాధ నొందెను.

8.వ స్థలము

యేసు ప్రభువు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట


ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.

    యేసు ప్రభువు నడిచి పోవు మార్గమునందున వారి దేహము నుండి రక్తము ప్రవాహముగా కారుచుండెను. కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్తితియండు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారల ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో “ ఎరుషలేము కుమార్తేలారా! నా నిమిత్తం ఏడువక, నీ నిమిత్తము, మీ బిడ్డల నిమితము ఏడువండి” అని మందలించిరి. (కొంతసేపు ధ్యానించుదము)    

      నా రక్షకుడైన యేసువా! నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గూర్చి చింతుచుచున్నాను. నరక వేదన భయమువలన నాకు దుఃఖము కలుగుచున్నది. ఆమెన్.        (1 పర. 1 మంగళ. 1 త్రిత్వ)

     
ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ


పాట:స్లీవ మోయు శక్తిలేక
ద్రోవయందు క్రిందగులే
లేవలేక యేసువు.



9. వ స్థలము

యేసు ప్రభువు మూడవసారి స్లీవ క్రింద బోర్ల పడుట



ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.


యేసు ప్రభువు మూడవసారి స్లీవ క్రింద  పడుటను ధ్యానించుదుముగాక! గాయములవల్లవారు బలహీనులయిరి. కొలపాతకుల నిష్టూరముగా నుండినను త్వరగా నడువవలయునని  రాణువులు తొందర చేయుచుంటిరి. (కొంతసేపు ధ్యానించుదము )


నా రక్షకుడైన యేసువా! మీ ప్రేఅను తిరస్కరింప జేసిన, నా దుర్గుమనులను, ఈ లోకాశాలను జయించుటకు మీరు కపాల కొండకు  పోవునపుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనుడనైయున్నాను. నా సొంత బలముచేత పాపములను విడిచి పెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చినయెడల  ఇక ఏనాటికి పాపములో పడను. ఆమెన్. (1. పర 1.మంగళ 1. త్రిత్వ)


ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ
అందరు: మా మీద దయగానుందండి స్వామీ


పాట: ఒంటనున్న గాయమంత
   నంతగా వస్త్రాలనెల్ల
  గెంటి నీడ్చి లాగిరి.

10 వ స్థలము

యేసు ప్రభువుని వస్త్రములు ఒలుచుట

  
ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.

    కొలపాతకులు బలవంతముగా యేసు ప్రభువు వస్త్రములను ఒలుచుటను గురించి ధ్యానించుదముగాక! వారి లోపలి వస్త్రములు, పగిలిన వారి శరీరముతో కరుచుకుని యుండెను ఆ క్రూరులు వాటిని మద్ది తనముగా లాగినప్పుడు వస్త్రముతో కూడా మాంసమును ఊడి వచ్చెను . ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను జూచి పరితపించుదము. (కొంతసేపు ధ్యానించుదము)

    నా రక్షకుడైన యేసువా! ఈ సమయమందు మీరు మీ శరీరమంతట పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక యుండుతకును, విరక్తత్వమునకు విరద్దమైన పాపములను చేయక యుండుటకును సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువులమీద నాకుగల ప్రేమనంతాయు ప్రేఇకివేసి మీ మీద మాత్రము ప్రేమనున్చుటకు నాకు అనుగ్రహము దయచేయండి. ఆమెన్. ( 1 పర. 1 మంగళ 1.త్రిత్వ)

ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ
అందరు: మా మీద దయగానుందండి స్వామీ


పాట: జంట దొంగావార్ల మధ్య
మంట భారమైన స్లీవ                
కంటగించి నాటిరి.


11 వ స్థలము

యేసు ప్రభువుని వస్త్రములు ఒలుచుట

ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.

    యేసు ప్రభువును స్లీవమీద పరున్దబెట్టిన వెనుక, తమ చేతులు చాచి మన రక్షణము కొరకు, తమ నిత్య పితకు తమ జీవమును బలిగా, ఒప్పగించినారని ధ్యానిన్చుడుముగాక! ఈ కిరాతకులు ఇనుప చీలల చేత వారిని స్లీవకు అoటగొట్టి, ఆ స్లీవను నాటిరి, అవమానముగల ఆ మ్రానిమీద వారు మహా వేదనతో చావవిడిచిరి (కొంత సేపు ధ్యానించుదము)

    నా రక్షకుడైన యేసువా! నా హృదయమును మీ పరిశుద్ధ పాదములకు అoటగొట్టి అది ఇంకా ఎన్నటికి మిమ్ము విడువక ఉండుటకు నిరంతరము మీ పాదముల కాచుకొని యుoడచేయండి. నా కన్నా అధికముగా మిమ్మును  ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనస్సుతో దుఃఖపడుచున్నాను. (1 పర . 1 మంగళ. 1 త్రిత్వ)
ఒకరు: మా మీద దయగానుండoడి స్వామీ
అందరు: మా మీదను దయగా నుoడoడి స్వామీ

పాట: నేడేయంత పుర్తియంచు     
వేడి శ్రీ శిరంబువంచి
వీడినారు  ప్రాణము

12 వ స్థలము

యేసు ప్రభువు స్లీవ మీద మృతి బొందుట

ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.

 యేసు ప్రభువు మూడు గంటల సేపు స్లీవ మీద మహా ఆవేదనతో క్రుంగి తలవంచి మరనిoచుటను గురించి ధ్యానించుదముగాక! (కొంతసేపు ధ్యానించుదము)

    నా రక్షకుడైన జేసువా! నా మీదగల ప్రేమచేత మీరు మృతి నొందిన స్లీవ మ్రానును భక్తితో ముద్దు పెట్టుకోనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమయిన మరణము నాకు రావలసి యుండెను. ఐనను మీ మరమను చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమయిన బాధలు పొందినందు చేత నాకు మోక్షభాగ్యము ఇచుడురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగలించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా యాత్మను మీ చేతులలో నొప్పగించుచున్నాను. ఆమెన్. (1 పర. 1 మంగళ. 1త్రిత్వ)
ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ

పాట: బాధ పెట్టు శత్రు గుంపు      
 నాదరించ వేడినారు     
నాధుడైన యేసువు

13 వ స్థలము
యేసు ప్రభువు స్లీవ నుండి క్రిందకు దింపపడుట

ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
    యేసు జీవమును విడిచిన వెనుక వారి సిష్యులగు ఎసేపు, నికోదేమను వారు, మిమ్ములను స్లీవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగలించుకొనుటను గురించి ధ్యానిoచుదముగాక. (కొంతసేపు ధ్యానించుదము)
    నా రక్షుకుడైన యేసువా! మీరు నా నిమితము మృతి పొందితిరి. కనుక నేను మిమ్ము సేవించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమియు లేదు. మీ నిమిత్తము మృతి పొంద నాశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాతా! నీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచు నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమెన్.        (1 పర. 1 మంగళ. 1 త్రిత్వ)
ఒకరు: మా మీద దయగా నుండండి
అందరు: మా మీద దయగా నుండండి.

పాట: భాసురుండు మోక్షరాజు
దాసులయిన పాపజాతి 
కోసమై మరణించెను
14 వ స్థలము
యేసు ప్రభువుని శరీరమును సమాధిలో ఉంచుట

ఒకరు: యేసు క్రీస్తువా! మిమ్ము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
అందరు: ఏలయనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి.
 ప్రభు శరీరమును భుస్తాపనము చేయుటకు శిష్యులు మోసికొని పోవుటను, వారి పరిశుద్ధ తల్లి వెంబడి పోయి  ఆ పరిశుద్ధ శరీరమును తానే సమాధిలో క్రమపరచుటను, అటు వెనుక వారాలు సమాధి మూసిఅందరు వెడలిపోవుటను గురించి ధ్యానించుదము గాక.
(కొంత సేపు ధ్యానము)
నా రక్షకుడైన జేసువా! మీ మీద ముసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు ముడవనాడు జీవవంతులై లేచితిరి గదా! ఈ వుహానమును చూచి లోకంత్యమున నేను మీతో ఉత్తానమగుటకు, మోక్షము నందు సదా మిమ్ము పొగడి ప్రేమించటకును, నాకు అనుగ్రహము పాలించండి.  (1 పర. 1 మంగళ. 1 త్రిత్వ)
 ఒకరు: మా మీద దయగా నుండండి స్వామీ
అందరు: మా మీద దయగా నుండండి స్వామీ
 పాట: పాపులైన దీనులారా
దాపుచేరి కోల్వరండి     
పాపదోష మీడునే
జపము
 హా! రక్షకుడా! లోక రక్షనముకొరకు మీరు యూదుల వలన తిరస్కరిoపబడను, ద్రోహియగు యుదా  ముద్దు వలన శత్రువులకు చూపింప బడను. అన్నాను,కైఫాసు,పిలాతు, హేరోదు అను వారల ముందర అవమానముగా ఒప్పగింపబడను , అబద్ద  సాక్ష్యముల వలన నేరము మోపబడను. కొరడాలతో కొట్ట బడను, ఉమ్మి వేయబడను, మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి, మీ వస్త్రములు తీసి మిమ్ము స్లీవమీద కొట్టి, యీటెచే పొడిచి, తెరువబడుటను చిత్త గించితిరే! నేను మహాపాపిగా నుండినను నేను ఇపుడు స్మరనచేసిన మీ తిరు మరణమును మీరు చూచి నరకబాధలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లీవ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగను వానిని తీసుకొని పోయిన స్థలమునకు  నన్నును తీసుకోనిపోండి.
(పరిశుద్ధ పాపు గారి తలంపు కొరకు 1 పర 1 మంగళ 1. త్రిత్వ)

1 comment: