Wednesday 15 February 2017

యేసు పాటులను తలంచు జపము


యేసు పాటులను తలంచు జపము


    ప్రభువా! మీరు నా కొరకు ఒలివేతు తోపులో ఆవేదన పడినపుడు, యూదులు మిమ్ము రాతి స్తంభమునకు కొట్టినపుడు, శిరస్సుమీద ముండ్ల కిరీటము పెట్టినప్పుడు రక్తముతో అనుకోని యుండిన మీ వస్త్రములను వలచినప్పుడు, మీ కరములందు, పాదములందు ఇనుప చీలలు కొట్టినప్పుడు, ప్రక్కలో యీటెచేత పొడిచినప్పుడు కారిన మీరక్తమును జూచి నా పాపములను సకల మానవుల పాపములకును నేను ఎవరి కొరకు వేడుకోనవలసి యున్నదో  వార పాపములను, నా తప్పిదము వలన ఎవరి పాపములకు కారమనుగా నుండినో వారి పాపములను, మీ అనంత దయతో మన్నించ నవధరించండి. మా రక్షణము కొరకు మీరు చిందిచిన రక్తము చూచి నా మీద దయగా నుండండి. మీ కుడిప్రక్కన తెరచి మీ హృదయమును దుసికోనిపోయిన,ఈటె యొక్క పోటు వలన కలిగిన గాయమునకు భక్తి వందనములతో నమస్కరించు చున్నాను.  ఈ గాయము మీ ప్రేమ యొక్క చలవయే! పాపిని, దాసుడైన నా పాప మలినమంతటిని కడుగు దివ్య రక్తమును, నీళ్ళను,ఒలుక బోసిన ఊటయే! ఆత్మలను అలకరింప తగిన వరప్రసాదముల బొక్కసమే! కరుణానిధివైన యేసు! నా మానవుల పై నెనరు కలిగి, నా పాపములను మన్నించి, నా క్రుతఘ్నుతను లక్ష్య పెట్టక, మీ కృపను మాత్రమే ఉద్దేశించి నన్ను మీ దాసునిగా చేసుకొమ్మని వేడుకొనుచున్నాను. ఆమెన్.


No comments:

Post a Comment