దేవమాత శరణుకోరు జపము
మిక్కిలి నెనరుగల తల్లీ! మీ శరణుకు పరుగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన
వారాలలో ఒకరైనను మీ వలన చేయి
విడువబడినట్లు ఎన్నడును లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి! దయా
రసము గల తల్లీ! ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపిoపబడి, మీ పవిత్ర పాదములను సమీపించి
వచ్చుచున్నాను నిట్టూర్పు విడిచి, ప్రలాపించి ఏడ్చేడు పాపినైన నేను మీ దయాళమును
కాచుకొని మీ సముఖములో నిలుచు చున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని
తల్లి లా విజ్ఞాపనములు త్యజింపక దయాపరియై
విననవధరించండి. ఆమెన్.
ఒకరు: పితయైన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా
నుండెడు పరిశుద్ద కన్య మరియమ్మా
అందరు: నా యందు దేవ విశ్వాసము అను పుణ్యము వర్దిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకోనండి.
ఒకరు: పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధ తల్లియైన కన్య
మరియమ్మా!
అందరు: నా యందు దేవ విశ్వాసము అను పుణ్యము వర్దిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకోనండి.
ఒకరు: పవిత్రాత్మయైన సర్వేశ్వరుని మిక్కిలి
ప్రియురాలైన కన్య మరియమ్మా!
అందరు: నా యందు దేవ విశ్వాసము అను పుణ్యము వర్దిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకోనండి.
ఒకరు: జన్మ పాపము లేక ఉద్భవించిన
పరిశుద్ధ మరియమ్మా! పాపులకు శరణమా! ఇదికి పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి.
అందరు: నా కొరకు వేడుకోనండి.
ఒకరు: పరిశుద్ద మరియమ్మా! ఈ దినము నేను అనేక
సత్క్రియలను చేయునట్లును, నాయoదుగల దుర్గుణములను అణుచునట్లును,
విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములు
కట్టుకొనకుండునట్లును మిమ్ము మనవి చేయుచున్నాను.
అందరు: నా కొరకు వేడుకోనండి.
ఒకరు: పునీత జోజప్ప! మీరు బాలయేసును అనేక శరీర ఆపదల
నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలయునని మనవి చేయుచున్నాను.
అందరు: నా కొరకు వేడుకోనండి.
ఒకరు: నా కావలైన సన్మనస్కుడా! దైవ
కృపచేత మీకు ఒప్పగిoపబడిన నన్ను ఈ దినము పిశాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి
పుణ్య మార్గములో నడిపిoపవలయునని మనవి చేయుచున్నాను.
అందరు: నా కొరకు వేడుకోనండి.
ఒకరు: నా పాలక పునీతులారా! మీ వలె
నేనును ఈ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకొని, ప్రేమించి సేవిoచునట్లు మిమ్ము మనవి
చేయుచున్నాను.
అందరు: నా కొరకు వేడుకోనండి.
ఒకరు: సకల పునీతులారా! మీతో
సర్వేశ్వరుని పరలోకములో దర్శించి, స్తుతింప దైవకృప నాకు దొరుకునట్లు మిమ్ము మనవి
చేయుచున్నాను.
అందరు: నా కొరకు వేడుకోనండి.
ఒకరు: సకల పునీతులారా! మీతో సర్వేశ్వరుని పరలోకములో
దర్శించి, స్తుతింప దైవకృప నాకు దొరుకునట్లు మేమ్మి మనవి చేయుచున్నాను.
అందరు: నా కొరకు వేడుకోనండి.
ఒకరు: సర్వశక్తుడు, దయాపరుడైన పిత,
పుత్ర, పవిత్రాత్మ అనెడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాచి కాపాడును
గాక.
అందరు: ఆమెన్.
No comments:
Post a Comment