Tuesday 14 February 2017

ప్రాతఃకాల జపము


ప్రాతఃకాల జపము
ఒకరు: స్వయంభువు, అనాది, అశరీరి, మితిలేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము, బలిమి       కారణముల చేత సర్వవ్యాపి, సర్వమునకు మూల కారణమైన పిత , పుత్ర, పవిత్రాత్మ యనెడు ఏక త్రిత్వ సర్వేశ్వరా! మిమ్ము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగినవారు మీరే!
అందరు: సదా కాలము మీ తిరు నామము స్తుతింపబడును గాక.
ఒకరు: దయా సముద్రమై యుండెడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములను         తలంచి మేలేరిగిన స్తోత్రము చేయుదుము గాక.
సర్వేశ్వరా! తమరు నా యాత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి, నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను దయ చేసితిరే !
అందరు: స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
ఒకరు: దేవా! ఈ రాత్రి యందు ఒక్క అపాయమైనను కలుగకుండా నన్ను కాపాడితిరే!
అందరు: స్వామీ  మీకే స్తోత్రము కలుగును గాక!
ఒకరు: దేవా! జ్ఞాన స్నానము ద్వారా నన్ను మీ సత్య తిరు సభలో చేర్చి, మీ బిడ్డనుగా జేసికొని, యేసు పవిత్ర మరణ ఉత్థానముల చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్తునిగా చేయ నవధరించితిరే!
అందరు: స్వామీ  మీకే స్తోత్రము కలుగును గాక!
ఒకరు: సర్వేశ్వరా! మీ ఏకైక కుమారుడైన యేసు నాథుడు నా కొరకు అనేక పాటుల ననుభావించి స్లీవమీద కఠినమైన మరణము పొంద తమరు చిత్తగించితిరే !
అందరు: స్వామీ  మీకే స్తోత్రము కలుగును గాక!

ఒకరు: సర్వేశ్వరా! మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారము యోగ్యునిగా ప్రవర్తించెదనని          దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను . నా తలంపు, వాక్కు, క్రియలను, ఆత్మ శరీరములను  మీ సేవకు తగినట్లు నడిపించుకొనుటకు మీకు  వశపరచుచున్నాను. నేను చేసేడు సత్క్రియ లన్నింటిని ఏసు నాథుని పుణ్య ఫలములతో దేవరవారు చేకొనండి. వాని వలన వచ్చెడు జ్ఞాన ఫలములను పొంది నా పాపములకొరకు ఉత్తరింప మనస్సుగా నున్నాను. ఆమెన్.

ఈ దినము మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొనెదము.
సకల కీడులనుండి                                                           మమ్ము రక్షించండి స్వామి!
సకల పాపములనుండి                                                     మమ్ము రక్షించండి స్వామి!
మీ కోపాగ్ని నుండి                                                             మమ్ము రక్షించండి స్వామి!
ఆకస్మికమైన, ఆయత్తము లేని మరణము నుండి                        మమ్ము రక్షించండి స్వామి!
పిశాచి తంత్రముల నుండి                                                మమ్ము రక్షించండి స్వామి!
కోపము, పగ మొదలైన దుర్గుణముల నుండి                                మమ్ము రక్షించండి స్వామి!
మొహాగ్ని నుండి                                                                మమ్ము రక్షించండి స్వామి!
పిడుగులు, ఘోర గాలి మొదలైన వాని నుండి                  మమ్ము రక్షించండి స్వామి!
భూకంపము నుండి                                                           మమ్ము రక్షించండి స్వామి!
అంటు రోగము, కరువు, యుద్ధము మొదలైన వాని నుండి            మమ్ము రక్షించండి స్వామి!
నిత్య మరణము నుండి,                                                    మమ్ము రక్షించండి స్వామి!
దేవరవారి మనుష్యావతార పరమ రహస్యమును జూచి,    మమ్ము రక్షించండి స్వామి!
దేవరవారి ఆగమనమును చూచి                                                   మమ్ము రక్షించండి స్వామి!
దేవరవారి జన్మమును జూచి                                             మమ్ము రక్షించండి స్వామి!
దేవరవారి తపోస్నానమును, ఉపవాసమును చూచి,                     మమ్ము రక్షించండి స్వామి!
దేవరవారి స్లీవను, పాటులను చూచి                                             మమ్ము రక్షించండి స్వామి!
దేవరవారి మరణమును, భుస్తాపనమును జూచి               మమ్ము రక్షించండి స్వామి!
దేవర వారి పరిశుద్ద శరీర ఉత్థానమును జూచి                               మమ్ము రక్షించండి స్వామి!
దేవర వారి మహిమ ప్రతాపముగల మొక్షారోహనమును జూచి       మమ్ము రక్షించండి స్వామి!
ఓదార్చెడు  పవిత్రాత్మ యొక్క రాకడను జూచి                 మమ్ము రక్షించండి స్వామి!
న్యాయనిర్ణయము జరిగెడు దినములలో                          మమ్ము రక్షించండి స్వామి!


No comments:

Post a Comment