Tuesday 14 February 2017

ఉదయకాల ప్రార్థన


13. ఉదయకాల ప్రార్థన

పరలోక భూలోకములను అందలి సమస్తమును సృష్టించి కాచి కాపాడు తండ్రి! 
గడచిన రాత్రి సకల అపాయములనుండి కాచి కాపాడి నందులకు 
మీకు  నా  కొసగిన  ఈ నూతన దినమును 
మీ కుమారుని వాక్యానుసారము జీవించుటకును
 తగు వరప్రసాదమును నాకు ప్రసాదించండి. 
నేను నా వారిని ప్రేమించుచు 
మీ ప్రేమలో జీవింప అనుగ్రహించండి. 
నేను ఎక్కడ వున్నాను, ఏమైనను మీ కుమారుని ప్రియమైన శిష్యునిగా జీవించుచూ, 
ఆయన నామమునకు  సాక్షిగా యుండు భాగ్యము నాకు దయచేయండి.
 మీ కుమారుని వాక్యానుసారము జీవించి 
నా మరణానంతరము ఆయన పునరుత్థాన మహిమలో
 పాలివడనగు గొప్ప అవకాశము నాకు అనుగ్రహించండి తండ్రి. 
ఆమెన్ .


No comments:

Post a Comment