Tuesday 14 February 2017

పాస్క త్రికాల జపము

12.పాస్క త్రికాల జపము

(పాస్క పండుగనుండి త్రిఏక సర్వేశ్వరుని పండుగ వరకు)

ఒకరు: పర లోకము యొక్క రాజ్ఞి సంతోషించండి
అందరు: అల్లెలూయ
ఒకరు: ఏలయన భాగ్యవతియైన మీ గర్భము నందు అవతరించినారు
అందరు: అల్లెలూయ
ఒకరు: ఆనతిచ్చిన ప్రకారము వుత్తానమైనారు
అందరు: అల్లెలూయ
ఒకరు: మా కొరకు సర్వేశ్వరునికి మనవి చేయండి
అందరు: అల్లెలూయ
ఒకరు: కన్యకై యుండెడు పరిశుద్ద మరియమ్మ ఆనందించి సంతోషించండి.
అందరు: అల్లెలూయ
ఒకరు: ఏలయన ఏలినవారు నిజముగా వుత్తానమైనారు
అందరు: అల్లెలూయ

ప్రార్థించుదుము:

సర్వేశ్వరా స్వామి! మీ దివ్య కుమారుడును మా నాధుడైన ఏసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరే! వారి దివ్యమాతయైన కన్య మరియమ్మ వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసు క్రీస్తు నాధుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమెన్.

No comments:

Post a Comment