Tuesday 14 February 2017

త్రికాల జపము


11.త్రికాల జపము

 ఒకరు: ఏలినవారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళ వార్త చెప్పెను.
అందరు: ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించెను.
(మంగళ వార్త జపము చెప్పాలి)
ఒకరు: ఇదిగో ఏలిన వారి దాసురాలను –
అందరు: నీ మాట చొప్పున నాకు అగును గాక.
(మంగళ వార్త జపము చెప్పాలి)
ఒకరు: పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారము ఎత్తెను.
అందరు: మరియు మనతో కూడా వాసమై యుండెను.
(మంగళ వార్త జపము చెప్పాలి)
ఒకరు: ఏసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు
అందరు: సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా! మా కొరకు  ప్రార్థించండి.

ప్రార్థించుదుము:

సర్వేశ్వరా స్వామి, సన్మస్కుడు చెప్పి నందువలన మీ పుత్రుడైన ఏసుక్రీస్తుని  మనుష్యావతారమును  తెలుసుకొంటిమి. అతని పాటుల వలనను, స్లీవ వలనను ఉత్థానము యొక్క మహిమను మేము పొందునట్లుగా  మాకు మీ వరప్రసాదములను దయచేయనవధరింప వలయునని దేవర వారిని వేడుకునుచున్నాము. ఏసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమెన్.

No comments:

Post a Comment