Tuesday, 14 February 2017

పాప సంకీర్తన జపము


10.పాప సంకీర్తన జపము

సర్వశక్తిగల సర్వేశ్వరునితోను, 
సహోదరి, సహోదరులారా!  మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను.
 ఏలయన తలంపు చేతను, 
వాక్కు చేతను, 
క్రియల చేతను, 
లోపము చేతను 
బహు పాపములు చేసితిని.
 ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. 
అందుచేత ఎప్పుడును కన్యకై యుండెడు పరిశుద్ద మరియమ్మయు, 
సకల దూతలును, 
పునీతులును, 
సహోదరి, సహోదరులారా!
 మీరునూ నా కొరకు
 మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను.  

No comments:

Post a Comment