Tuesday 14 February 2017

విశ్వాస సంగ్రహము


5. APOSTLES CREED
విశ్వాస సంగ్రహము  

పర లోకమును, భూలోకమును సృష్టించిన సర్వశక్తికగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. (ఆది 1:1-31; రోమీ 1:20) (మత్తయి 5:45)
అతని యొక్క ఏక పుత్రుడును, మన యొక్క నాథుడైన ఏసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. (మత్తయి 3:17; ఫిలిప్పీ 2:12)
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.(లూకా 1:35) (లూకా 2:7)
పోoత్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి,స్లీవ మీద కొట్టబడి మరణము పొంది  సమాధిలో వుంచబడెను. (యోహాను 19:29-42)
పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారాలలో నుండి లేచెను. (మత్తయి 28:1-10; యోహాను 20:11-18)
పర లోకమునకు ఎక్కి  సర్వశక్తికగల  పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి యున్నాడు. (లూకా 24:51),(హెబ్రీ 1:3)( మార్కు 14-36)
అక్కడ నుండి జీవించు వారలకును, చనిపోయిన వారలకును తీర్పు చేయుటకును వచ్చును. .(మత్తయి 16-27; అ|| కా|| 10:39-43)
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను(యోహాను 14:15-20; అ||కా||1:7-10)
 పరిశుద్ద కతోలిక సభను,(మత్తయి 16:18-19; ఎఫేసి 5:26-27; కొలస్సీ 1:24)
 పునీతుల సంబంధ ప్రయోజనమును(మత్తయి 28:19-20; 2 కోరింతి 11:13; 1 కొరింతి15:33) 
 పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.(యోహాను 20:22-23)
శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను.( 1 కొరింతి 15:51-54; 1 తెస్స 4 13-18)
 నిత్య జీవమును విశ్వసించుచున్నాను.(1 యోహాను 5:20)
 ఆమెన్.

No comments:

Post a Comment