Wednesday 15 February 2017

3) దివ్యసత్ప్రసాదము




3)   దివ్యసత్ప్రసాదము

ప్ర: దివ్యసత్ప్రసాదము అనగా నేమి?

జ: గోధుమ అప్పముయెక్కయు ద్రాక్షా రసము యొక్కయు, గుణములలో యేసు నాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము వెంచేసియుండు దేవ ద్రవ్య అనుమానము.

ప్ర: దివ్యసత్ప్రసాదము అప్పము వున్నదా?

జ: అప్పము యొక్క రూపము, రుచి మొదలగు గుణములుండినను, అప్పము లేదు.

ప్ర: అప్పము ఏమై పోయెను?

జ: నడి పూజలో యేసు నాధుని దివ్య ఆత్మ, దివ్య శరీరము ,దివ్య రక్తము దేవ స్వభావమై పోయెను.

ప్ర: యేసు నాధుడు దివ్య సత్ర్పసాదమును  స్థాపించిన కారణములెన్ని?

జ: మూడు .

1.     మన ఆత్మకు దివ్య భోజనమై  ఉండుటకు.

2.     మనతో వాసము చేయుటకు.

3.     తన మరణమును జ్ఞాపక పరచుటకు దివ్య ప్రసాదమును స్థాపించెను.
ప్ర: దివ్యసత్ర్పసాదము మన ఆత్మకు ఎటుల దివ్య భోజనమై యున్నది?

జ: భోజనము శరీరమునకు బలము యిచ్చునటుల దివ్యసత్ర్పసాదము లోకోనుటవలన, యేసు నాధుని దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవా స్వభావము ఆత్మకు జ్ఞానబలము ఇచ్చును కనుక ఇది  ఆత్మకు దివ్య భోజనమై యున్నది.

ప్ర: యేసు నాధుడు మనయందు ఎందుకు వేంచేయు చున్నాడు?

జ: పాపాత్ములమైన మనకు తన మితిలేని ప్రేమను చూపుటకును, మనలను పాపము నుండి కాపాడుటకు వేంచేయుచున్నాడు.

ప్ర: దివ్య సత్ర్పసాదమును లోకొనిన వెనుక మనము ఏమి చేయవలయును?

జ: మనయందు వేంచేసిన యేసు నాధుని నిండు విశ్వాసముతో ఆరాధించి, మనకు కావలసిన మేలులను అడుగుకొనవలయును.

ప్ర: దివ్య సత్ర్పసాదమును లోకొనుటకు ఎన్ని ఆయత్తములు కావలయును?

జ: 1. ఆత్మ ఆయత్తము,

     2.శరీర ఆయత్తము      అను రెండు ఆయత్తములు కావలయును.

ప్ర: ఆత్మ ఆయత్తము అనగా నేమి?

జ: ఆత్మ చావైన పాపము లేక ఉండవలయును.

ప్ర: శరీర ఆయత్తము అనగా?

జ: దివ్యసత్ర్పసాదము లోకొనుటకు ముందు ఒక గంట కాలము ఉపవాస ఉండవలయును. మంచి నీళ్ళు ఉపవాసమును చెరచదు.

ప్ర: యేసు నాధుడు దివ్యసత్ర్పసాదములో ఎటుల మనతో వాసము చేయుచున్నాడు?

జ: యేసు నాధుడు పీఠము మీద దేవ మందసములో రాత్రింబవళ్ళు వాసము చేయుచు, మన మనవులను ఆలకించుచున్నాడు.

ప్ర: యేసు నాధుడు దివ్యసత్ర్పసాదము చేత తన మరణమును ఎటుల జ్ఞాపకపరచుచున్నాడు?

జ: తాను స్లీవమీద సమర్పించిన బలిని, దివ్యసత్ర్పసాదము ద్వారా ఎల్లప్పుడును పూజలో  సమర్పించుట వలన తన మరణమును జ్ఞాపకపరచ చున్నాడు.

ప్ర: దివ్య బలిపూజ యొక్క ముఖ్య భాగములెన్ని?

జ: 1. దైవ వాక్యార్చన

     2. క్రుతజ్ఞాతార్చన

     ౩. సత్ర్పసాద క్రమము

ప్ర: దివ్య బలిపూజ సర్వేశ్వరునికి ఎందుకు సమర్పించ బడుతుంది?

జ: సర్వేశ్వరునికి ఆరాధన యు, మేలేరిగిన స్తోత్రమును చేయుటకును, మనము దేవవరప్రాదములను, పాపములకు రాదగిన అనిత్య శిక్ష తొలగింపును పొందుటకు దివ్యబలిపూజ సర్వేశ్వరునికి సమర్పింప బడుచున్నది.

No comments:

Post a Comment